చిరంజీవి స్టేట్స్‌మన్‌గా
చిరంజీవి 27 అక్టోబర్ 2012 నుండి 26 మే 2014 వరకు కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రిగా స్వతంత్ర హోదాలో బాధ్యతలు నిర్వహించారు. తన పదవి కాలంలో దేశ వ్యాప్తంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే కాకుండా.. ఈ రంగం అభివృద్దిలో తన పదవీ కాలంలో చెరగని ముద్ర వేశాడు. పర్యాటక మంత్రి అంటే ప్రచారం నిర్వహించడమేకాదు... పర్యాటకులు అధికారులనుంచి సరైన సహకారాలు అందేలా మార్పులు తీసుకురాగలిగారు. హోంశాఖ, విదేశాంగ శాఖలను సమన్వయం చేసుకుంటూ ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలిగారు.
చిరంజీవి ప్రజారాజ్యం అనే రాజకీయ పార్టీని 26 ఆగష్టు 2008 న స్థాపించారు. సామాజి న్యాయం, సమాజంలో అందరికీ సమాన అవకాశాలు అనే లక్ష్యంతో పార్టీని స్థాపించారు. తన లక్ష్యాలను అనుగుణంగా వెనుకబడిక కులాల అభ్యర్థులకు 100కు పైగా అసెంబ్లీ సీట్లు కేటాయించిన మొదటి పార్టీ ప్రజారాజ్యం చరిత్ర సృష్టించింది. 9 నెలల్లోనే చిరంజీవి స్థాపించినపార్టీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 18% ఓట్లను సాధించింది. 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 2009లో తిరుపతి అసెంబ్లీనుంచి ఆంధ్రప్రదేశ్ శాసన సభకు ఎన్నికయ్యారు.
2010 సెప్టెంబరు 2న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. ఇది రాష్ట్రాన్ని తీవ్ర గందరగోళానికి, రాజకీయ అనిశ్చితికి గురిచేసింది. ఈ సంమయంలో స్థిరమైన ప్రభుత్వం మరియు ప్రభావవంతమైన పాలనను అందించడానికి, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని 6 ఫిబ్రవరి 2011న కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. 2012 సంవత్సరంలో ఆయన పార్లమెంటు సభ్యుడిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆరుసంవత్సరాలు ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు.
చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో పర్యాటక రంగానికి కేటాయింపులు పెంచాల్సిందిగా ఆర్ధిక శాఖామంత్రి చిదంబరం గారిని కొరారు. ఈ రంగం జీడీపీలో 6% జీడీపీని సాధింస్తుందని చెప్పాదు. దాదాపు పది శాతం మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. పర్యాటక రంగంద్వారా 18 మిలియన్ యుఎస్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తుందని వివరించారు.