top of page

వాస్తవాలు & ట్రివియా

White Background

విద్యాభ్యాసం

చిరంజీవి విద్యాభ్యాసం గుంటూరు జిల్లాలో ప్రారంభమైంది. కానీ తండ్రి ఉద్యోగం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలలో చదవవలసి వచ్చింది. మంగళగిరి ప్రాధమిక పాఠశాలలో రెండో తరగతి వరకు చదువుకున్నారు. ఆ తరువాత పామ‌ర్రు ZPH పాఠశాలలో మూడేళ్లు విద్యనభ్యసించారు. అనంత‌రం నాలుగేళ్లపాటు మొగల్తూరు, బాపట్లలో విద్యాభ్యాసం కొన‌సాగించారు. ఒంగోలులో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన చిరంజీవి, నరసాపూర్‌లోని యర్రమల్లి నారాయణమూర్తి కళాశాలలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు.

White Background
manaoori.tif

బాల్యంపై ప్ర‌భావం

చిరంజీవి సినమా తెరపై చూసిన మొట్టమొదటి నటుడు కృష్ణం రాజుగారు. చిన్నతనంలో ‘బాల రాజు కథ‌’లో మాస్టర్ ప్రభాకర్, ‘ బడి పంతులు’లో బేబీ శ్రీదేవితో పాటు అప్పటి ప్రముఖ బాల కళాకారుడు, అనేక సినిమాల్లో నటించిన విశ్వేశ్వర్ రావు అంటే చాలా ఇష్టం. చిరంజీవి కూడా వారిలాగే ఉండాలని కోరుకునేవాడు.

White Background
nyamkavaali (2) - Copy - Copy.JPG

మొదటి మార్క్

చిరంజీవి ఒక‌ట‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న స‌మ‌యంలో టీచ‌ర్ పిలిచి ప‌రీక్షా ప‌త్రాన్ని చేతికి ఇచ్చి దానిని త‌ల్లిదండ్రుల‌కు చూపించ‌మ‌ని చెప్పారు. ఆ ప‌రీక్ష‌లో చిరంజీవికి కేవ‌లం ఒక్క‌మార్కు మాత్ర‌మే వ‌చ్చింది. ఒక్క‌మార్కును చూసి తానేదో ఘ‌న‌కార్యం సాధించిన‌ట్లు ఫీలై ఇంటికి ప‌రిగెత్తుకెళ్ళ‌తాడు. తాను సాధించిన మార్కులు, ఆన్స‌ర్‌షీట్‌ను తండ్రికి చూపించాడు. కొడుకు మార్కులు చూసిన తండ్రి వెంక‌ట‌రావు చిరంజీవిని మంద‌లించాడు. ప‌రీక్ష‌లో ఒక్క‌మార్కే వ‌చ్చినందుకు త‌ల్లికూడా మంద‌లించింది. దీంతో చిరంజీవికి ఎందుకు తిడుతున్నారో అర్ధంకాలేదు. అప్ప‌టినుంచి టీచ‌ర్ కూడా అత‌నిని "మొద‌టి మార్కు" అని పిలిచేవాడు.

White Background
intiguttu (6).jpg

చిరంజీవి & స్పోర్ట్స్

చిరంజీవి క్రీడలలో అంతగా రాణించనప్పటికీ, క్రికెట్ అంటే ఆసక్తి ఉండేది. పెద్ద క్రికెటర్‌ కావాల‌ని క‌ల‌లు క‌న్నాడు. అందుకోసం ప్రాక్టీస్ కూడా మొద‌లుపెట్టాడు. మొద‌టి మ్యాచ్‌లోనే చిరంజీవి బొట‌న‌వేలికి గాయం అయింది. ఈ గాయం నయం కావడానికి దాదాపు ఏడాది పట్టింది. ఆ త‌రువాత చిరంజీవి మ‌ళ్ళీ క్రికెట్ గ్రౌండ్‌కు వెళ్ళ‌లేదు. అయితే స్టార్ క్రికెట్ టోర్న‌మెంట్‌లో మాత్రం ఒక జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఈ టోర్న‌మెంట్‌లో విజ‌యంసాధించి త‌న చిన్న‌నాటి క‌ల‌ను సాకారం చేసుకున్నారు. 

White Background
mekanic alludu.jpg

కలలు

ఒకసారి చిరంజీవి వేసవి సెలవులకు హైదరాబాద్‌ వచ్చాడు. అప్పుడు రామకృష్ణ 70MM ధియేటర్‌కు ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, జమున వస్తున్నట్లు తెలిసింది. వాళ్ళను ప్రత్యక్షంగా చూసేందుకు థియేటర్‌కు వెళ్ళాడు. ఎప్పటికైనా వారితో కలసి నటించాలని కలలు కనేవాడు.

White Background
V R 8.tif

పుట్టినరోజులు

చిరంజీని వాళ్ళ అమ్మమ్మ చిన్నతనంలో ముద్దుగా శంకరబాబు అని పిలిచేది. చిరంజీవి బాల్యం ఆస‌క్తిక‌రంగా సాగింది. భ‌విష్య‌త్తులో సాధించ‌బోయే విజ‌యాల‌కు ఆరంభం అక్క‌డే పడిందని చెప్పాలి. చిరంజీవి త‌న పుట్టిన రోజును మొద‌టినుంచి కుటుంబ స‌భ్యులు, శ్రేయోభిలాషుల‌మధ్య ఆనందంగా. స‌ద‌రాగా, ఉల్లాసంగా గ‌డిపేవారు. చిరంజీవితో అనుబంధమున్న కుటుంభ సభ్యులు కానీ, మిత్రులు కానీ ఆయనను ఎప్పటికీ వదులుకోలేరు.

White Background
pranamkhareedu.JPG

​మొదటి సినిమా

చిరంజీవి సినీరంగ ప్ర‌వేశం అంత సుల‌భంగా జ‌ర‌గ‌లేదు. ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో యాక్టింగ్ నేర్చుకుంటున్న స‌మ‌యంలో అనేక ఇబ్బందులు ప‌డ్డాడు. చిరంజీవి మొద‌టి సినిమా ప్రాణం ఖ‌రీదు. 22-10-1978న విడులైంది. అంత‌కుముందు రాజ్‌కుమార్ ద‌ర్శ‌కత్వంలో పునాదిరాళ్ళు అనే సినిమాలో న‌టుడిగా మొద‌టి అవ‌కాశం ద‌క్కింది.  అయితే నిర్మాత క్రాంతికుమార్ ప్రాణం ఖ‌రీదు సినిమాలో ఒక పాత్ర‌ను ఆఫ‌ర్ చేశాడు. అనుకోకుండా రెండో సినిమా మొద‌ట విడుద‌లైంది. ఈ సినిమాలో మొద‌ట చిరంజీవి పాత్ర‌కు సుధాక‌ర్‌ను ఎంపిక చేశారు. అయితే అప్ప‌టికే సుధాక‌ర్ భార‌తీరాజ సినిమాలో న‌టిస్తుండ‌డంతో ఆ పాత్ర చిరంజీవికి దక్కింది. అలా చిరంజీవి ప్ర‌యాణం మొద‌లైంది. 
    విడుద‌ల‌కంటే ముందే కె.బాల‌చందర్‌, కె.బాపు ప్రాణం ఖ‌రీదు ప్రివ్యూను చూశారు. చిరంజీవి యాక్ష‌న్ న‌చ్చ‌డంతో బాపు మ‌న‌వూరి పాండ‌వులు సినిమాలో అవ‌కాశం క‌ల్పించారు. కె.బాల‌చందర్ కూడా త‌న త‌రువాత సినిమాలో చిరంజీవికి ఆఫ‌ర్ ఇచ్చారు. అలా ఒక‌దాని త‌రువాత మ‌రొక ఆఫ‌ర్‌లు రావ‌డంతో... ఆ త‌రువాత చిరంజీవి వెనుదిరిగి చూసుకోలేదు. అయితే ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చేర‌క‌ముందే మెగాస్టార్ యాక్టింగ్ కెరీర్ ప్రారంభ‌మైంది. చిరంజీవి 1976 జ‌న‌వ‌రి 26న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్వ‌హించిన రిప‌బ్లిక్ డే పెరేట్‌లో త‌న న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించారు.  

White Background
sera car 4.tif

నటుడు

తన నటనతో తానే చిరంజీవి స్పూర్తి పొందేవారు. చిరంజీవికి నటనతో విడదీయరాని అనుబంధం ఉండేది. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండడానికి ఇష్టపడేవారు. అది ఎంతలా అంటే కేవలం 8 సంవత్సరాల్లోనే 90 వరకు సినిమాల్లో నటించేలా చేసింది. 1980 నాటికి 11 చిత్రాల్లో నటించారు. ఆ తరువాత 8 సంవత్సరాల్లోనే చిరంజీవి సినిమాల సంఖ్య వందకు చేరింది. మొదటి సినిమా విడుదలైన పదేళ్ళలోనే 138 సినిమాలు చేశారు. వీటిలో ఎన్నో సూప‌ర్‌హిట్‌లు ఉన్నాయి. సినీ హీరోగా ఎన్నో మెట్లు ఎక్కిన చిరంజీవి కోట్ల‌మంది సినీ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చోటు సంపాదించుకున్నారు. ఎంతో మంది న‌టులకు స్పూర్తిగా నిలిచారు. 

White Background
sivudu sivudu (2) - Copy - Copy.jpg

​మొదటి ఇంటర్వ్యూ

చిరంజీవి తన 23 ఏళ్ళ వయసులోనే అప్పటి ప్రముఖ సినీ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. చిత్రజ్యోతి పత్రికలో చిరంజీవి మొదటి ఇంటర్వ్యూ ప్రింటయింది. అప్పటికి చిరంజీవి కేవలం ఒక్క సినిమా మాత్రమే చేశారు. చిరంజీవిని మొట్ట‌మొద‌టి సారి ఇంట‌ర్వ్యూ చేసిన ఎం.కోటేశ్వ‌ర‌రావు చిరంజీవిని క్రాంతికుమార్‌ కనుగొన్న మెరుపుగా అభివర్ణించారు. ఈ ఇంట‌ర్వ్యూ జూలై 21, 1978 న జ్యోతిచిత్ర ఫిల్మ్ మ్యాగజైన్‌లో ప్ర‌చురిత‌మైంది.

White Background
punnaminagu (3).jpg

టర్నింగ్ పాయింట్

`పున్నమినాగు ` సినిమా తరువాత చిరంజీవి ఒక్కసారిగా పాపులర్‌ నటుడిగా మారిపోయారు. 1983లో విడుదలైన ఖైదీ సినిమా చిరంజీవిని సినీ రంగంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళిందని చెప్పాలి. ఖైదీ సినిమా విడుదలైన తరువాత అభిమానులు చిరంజీవిని అనుకరించడం ప్రారంభించారు. చిరంజీవి వేసుకున్న బట్టల దగ్గరనుంచి ఆయన వ్యవహారశైలి, మాటతీరు, హావభావాలు ఇలా అన్నింటినీ అనుకరించి అభిమానులు ఆనందించేవారు. ఈ సినిమా తరువాత చిరంజీవి మామూలు నటుడుగా కాదు మెగాస్టార్‌ పేరుతో అగ్రస్థానానికి వెళ్ళిపోయారు. అంతేకాదు చిరంజీవి తెరపైనే కాదు, సినిమా బయట కూడా ప్రేక్షకుల అభిమాన దేవుడిగా మారిపోయారు. 

White Background
pranam.JPG

బాల్యం

చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. చిరంజీవికి తల్లిదండ్రులు కొణిదెల శివశంకర వరప్రసాద్‌ అని పేరుపెట్టారు. తమ పుత్రుడు భవిష్యత్తులో తెలుగు సినీ ప్రేమికుల హృదయాలను దోచుకుంటాడని ఊహించి ఉండరు. కుటుంబంలో మొదటి సంతానంగా జన్మించారు. బాల్యం ఎక్కువగా గ్రామీణ నేపధ్యంలోనే సాగింది. మంగళగిరి, పామర్రులో ప్రాధమిక విధ్యను అభ్యసించాడు. భార్య అంజనాదేవి సహకారంతో చిరంజీవి తండ్రి వెంకటరావు నలుగురు పిల్లల కుటుంబాన్ని ఎలాంటి చిక్కులు లేకుండా నడిపాడు. ఉద్యోగరిత్యా తండ్రికి ఎక్కవగా ట్రాన్స్‌ఫర్స్‌ జరుగుతుండేవి. అందుకే పలు ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చేది. ఈ క్రమంలో మొగల్తూరు, ఒంగోలు, బాపట్లలో కొంతకాలం గడిపారు. చిరంజీవి యవ్వనం ఈ ప్రాంతాలలోనే సాగింది.

White Background
DpSQD7AV4AEW2qM.jpg

అతని తల్లికి

చిరంజీవి చిన్నతనంలో తన తల్లి కట్టెల పొయ్యిపై వంట చేసేవారు. పొయ్యిపై మంటరాజేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పొగకు కళ్ళు మండేవి. దీంతో తల్లి కళ్ళలో నీళ్ళు తిరిగేవి. ఆ సంఘటనలు చూసినప్పుడల్లా చిరంజీవి హృదయం ద్రవించేంది. తల్లిని ఆలింగనం చేసుకోవడం మినహా అప్పట్లో ఏమీ చేయలేకపోయేవాడు. అప్పుడే ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడు. తాను పెరిగి పెద్దయ్యాక తల్లికి ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అన్నట్లుగానే తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.

White Background
Chiru mom.webp

చెరగని ముద్ర `అమ్మ`

చిరంజీవి చిన్నతనంలో ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన అతని హృదయంపై చెరగని ముద్ర వేసింది. ఓ యువకుడు తన ఇంట్లో దొంగతనం చేస్తూ చిరంజీవి తండ్రి వెంకటరావుకు పట్టుబడ్డాదు. తండ్రి ఆ యువకుడిని కరెంటు స్థంభానికి కట్టేసి పోలీసులకు కంప్లైంట్‌ చేయడానికి వెళ్ళాడు. అయితే చిరంజీవి తల్లి మాత్రం ఆ యువకుడి కట్లు విప్పి కుడుపునిండా భోజనం పెట్టింది. ఇంకెప్పుడూ దొంగతనాలు చేయవద్దని హెచ్చరించి పంపించి వేసింది. తల్లిలోని కరుణామూర్తి చిరంజీవిని హృదయాన్ని కదిలించింది. చిరంజీవికూడా ఇదే స్పూర్తిని పుణికి పుచ్చుకున్నాడు.

White Background
chiranjeevi-surekha-marriage-photo_b_0110200449.jpg

వివాహ ఘడియలు

1980 ఫిబ్రవరి 20వ తేదీన చిరంజీవి ప్రముఖ నటుడు అల్లూ రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్నారు. చిరంజీవి జీవితంలో ఇది చిరస్మరణీయమైన రోజు. ఈ వివాహంతో చిరంజీవి జీవితంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. బ్యాచిలర్‌ జీవితాన్ని వీడి సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాడు

White Background
chiranjeevi_153491341680.jpeg

తాతతో అనుబంధం

కుటుంబ పెద్దలు కొణిదల శివశంకర వరప్రసాద్‌ అని పేరుపెట్టారు. అప్పుడు వాళ్ళు తమ చిన్నారి భవిష్యత్తులో కోట్లాది సిమామా అభిమానుల హృదయాల్లో కొలువై ఉంటారని భావించి ఉండరు. వెంకటరావు, అంజనాదేవి సంతానంలో చిరంజీవి పెద్దవాడు. చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్‌లో జన్మించారు. చిరంజీవి బాల్యం ఎక్కవగా గ్రామీణ నేపధ్యంలోనే సాగింది. చిరంజీవి జీవితంలో మంగళగిరి, పామర్రు ప్రత్యేక ముద్రను వేశాయి. ఇక్కడే చిరంజీవి ప్రాధమిక విద్యను అభ్యసించారు. చిరంజీవి తండ్రి వెంకటరావు అంజనాదేవి సహకారంతో నలుగురు పిల్లల కుటుంబాన్ని ఎలాంటి చిక్కులు లేకుండా నడపగలిగారు. తండ్రి ఉద్యోగరిత్యా  ట్రాన్స్‌ఫర్స్‌ ఎక్కవగా జరుగుతుండేవి. దీంతో చిరంజీవి కుటుంబం ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చింది. ఈ కారణంగానే మొగల్తూరు, ఒంగోలు, బాపట్లలో కొంతకాలం గడిపారు. చిరంజీవి యవ్వనం ఈ ప్రాంతాలలోనే సాగింది.

White Background
manavuuripandavulu_edited.jpg

పట్టుబడ్డ వైనం

చిరంజీవి చాలాసార్లు ఇంట్లో చెప్పకుండా సినిమాకు వెళ్ళేవాడు. అయితే ఒకసారి మాత్రం తల్లిదండ్రుల నుంచి తప్పించుకోలేక పోయాడు. తమ్ముడు నాగబాబుతో కలసి నెల్లూరు రంగ మహల్‌లో మాట్నీ సినిమాకు వెళ్ళాడు. ఆరోజు వాళ్ళను దురదృష్టం వెంటాడింది. మాట్నీ సినిమాకు వెళ్లి వస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా తండ్రికి పట్టుబడ్డారు.

White Background
stuvartpuram.jpg

ముఖ్యమైన సంవత్సరాలు

అది 1977 సంవత్సరం. మద్రాసులో చిరంజీవి సినిమా కెరీర్‌ ప్రారంభంలో తడబడుతున్న సమయంలో సౌత్‌ ఇండియా ఫిలిం ఛాంబర్‌ నిర్వహిస్తున్న ఫిలిం ఇనిస్టిట్యూట్‌ నుంచి డిప్లొమా సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఇది సినిమా మీద చిరంజీవికి ఉన్న ఇష్టానికి ఎలాగైనా తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదలకు నిదర్శనం. ఎలాగైనా సినిమా తెరపై ఒక వెలుగు వెలగాలని బలంగా కోరుకునే వాడు. అందుకోసం ఎంత కష్టపడడానికైనా వెనుకాడేవాడు కాదు. అతనిలోని ఆ బలమైన కోరికే చిరంజీవిని ఈ స్థాయిలో నిలబెట్టింది. చిరంజివీలో బలంగా పాతుకుపోయిన దృఢ సంకల్పానికితోడు విధిబలం కూడా తోడవడంతో కొణిదెల శివశంకర వరప్రసాద్‌ ఎవరూ అందుకోలేనంత గ్లామర్‌ను సొంత చేసుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమపై మరెవరికీ సాధ్యకానంతగా చెరగని ముద్రను వేయగలిగారు. 

White Background
raktasindhuram (5).jpg

ఇష్టమైన బొమ్మ

చిరంజీవికి చిన్నతనంలో తమ ఇంట్లోని చెక్క గుర్రం బొమ్మను బాగా ఇష్టపడేవారు. చిన్నతనంలో దానిపై కూర్చుని గుర్రంపై స్వారీ చేస్తూ ఆడుకునేవాడు. తల్లి అంజనాదేవి చిరంజీవికి దీనిపై ఆడుకునేటప్పుడు అన్నం తినిపించేంది. ఆ తరువాత కాలంలో తల్లి చిరంజీవి స్పటిక గుర్రాన్ని బహుమతిగా ఇచ్చినప్పుడు చిరంజీవికి చిన్నతనంలోని మధుర స్మృతులను గుర్తు చేసింది. 

White Background
IMG_22082019_120910_600_x_600_pixel.webp

ది ఫ్యామిలీ మ్యాన్

చిరంజీవి ప్రపంచం తన కుటుంబం చుట్టూ తిరుగుతుంది. చిరంజీవి దృష్టిలో ఫ్యామిలీ అంటే కుటుంబ సభ్యులు మాత్రమే కాదు. ఇన్ని సంవత్సరాల సినీ ప్రయాణంలో తనని అభిమానించిన అభిమానులను కూడా కుటుంబ సభ్యులుగా భావించేవారు. చిరంజీవికి చిన్నతనంనుంచి కుటుంబం అంటే చాలా ఇష్టం. తన తల్లిదండ్రుల సంతానంలో చిరంజీవే పెద్దవాడు. నాగేంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, విజయ, మాధవి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. ఈ నలుగురికీ చిరంజీవి ఎప్పుడూ మార్గదర్శకుడిగా, గురువుగా, స్నేహితుడిగా ఉండేవాడు. 25 సంవత్సరాల వైవాహిక జీవితంలో చిరంజీకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. స్మిత, శ్రీజ, రాంచరణ్‌ చిరంజీవి సంతానం. చిరంజీవి తన పెద్ద కుమార్తె సుస్మితను వ్యాపారవేత్త విష్ణకి ఇచ్చి వివాహం జరిపారు. చిరంజీవి కంప్లీట్‌ ఫ్యామిలీమెన్‌ అనడానికి ఇంతకంటే నిదర్శనాలు ఏం కావాలి.

White Background
maranamrudagam (2)_edited.jpg

తమ్ముడు నాగబాబుతో..

చిరంజీవి యువకుడిగా ఉన్నప్పుడు తమ్ముడు నాగబాబుతో కలసి ఈత, బాక్సింగ్, రెజ్లింగ్‌కు వెళ్ళేవాడు. తల్లిదండ్రులకు తెలియకుండా తమ్ముడితో కలసి ఇవన్నీ చేసేవాడు. తండ్రి ఉద్యోగంలో ట్రాన్స్‌ఫర్ల కారణంగా ఈ కుటుంబం చాలా ఊర్లు తిరగాల్సి వచ్చేది. అనుకోకుండా చాలా ప్రాంతాల్లో ముస్లిం కుటుంబాలు ఉన్న ప్రాంతాలలో నివసించారు. దీంతో చిరంజీవి స్నేహితులలో ఎక్కవమంది ముస్లింలు ఉండేవారు. దీంతో ముస్లిం సంస్కృతి, సంప్రదాయాలు కొణిదెల యువకుల్లో జీర్ణించుకుపోయయి.  స్నేహితులతో కలసి నమాజ్‌చేయడం, వారి ఇళ్ళలో భోజనాలు చేయడం చేసేవారు. ఈ ఘటనలు వారిలో అన్ని మతాలను గౌరవించే సంస్కృతిని నేర్పాయి. అందుకే ముఠామేస్త్రి సినిమాలో ముస్లింలపై తనకు ఉన్న అభిమానాన్ని ప్రతిబింబించేలా పలు సీన్లు ఉంటాయి. 

White Background
chiru new look 2.jpeg

చిరంజీవిగా మార్పు

గొప్ప జీవితాలన్నీ ఆరంభంలో చిన్నగానే ఉంటాయి. చిరంజీవి విషయంలోనూ అదే జరిగింది. అభిమానమే చిరంజీవిని చిరు అని పిలిచేలా చేసింది. పల్లెటూరు వాతావరణం ఇతరులకు కొత్త కావచ్చు కానీ చిరంజీవికి కాదు. మారుమూల గ్రామం నుంచి వచ్చిన చిరంజీవి అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. పట్టుదల, అకుంఠిత దీక్షతో పాటు అనుకున్నది సాధించాలనే తపన ఉంటే విజయం తప్పక వరిస్తుందని నిరూపించారు. చిరంజీవి.

White Background
VOORIKICHHINA MATA.jpg

అభిమానులు

చిరంజీవి ఎప్పటికప్పుడు తనని తాను మార్చుకోవడంలో అభిమానుల పాత్ర మరువలేదిది. తన సుదీర్ఘ నట జీవితంలో ఎప్పుడూ అభిమానులను విస్మరించలేదు. సినీ రంగంలో ఆటుపోట్లు ఎదురైనా అభిమానులు మాత్రం ఆయన వెన్నంటే ఉన్నారు. అభిమానులు చూపించిన ప్రేమ అభిమానాలతోనే చిరంజీవి ఎప్పటికప్పుడు తనను తాను పరిస్థితులకు అనుగుణంగా మలచుకోవడంలో సహాయపడ్డాయి. చిరంజీవిలో అందరికీ నచ్చేది అతని వినయం, మృధు స్వభావం. ఇవే అతనిని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేయగలిగాయి. ఇవే అతన్ని కోట్లాదిమంది హృదయాలను ఆకర్షించేలా చేశాయి. 

White Background
filmfareawards_145.jpg

కెరీర్ మైలురాళ్లు, అవార్డులు

1980, 90 దశాబ్దాలలో చిరంజీవి 152 సినిమాల్లో నటించాడు. అంతేకాదు భారత దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా ఎదిగారు. తెలుగు చలనచిత్ర సీమలోనే విజయవంతమైన హీరోగా తనదైన ముద్రను వేయగలిగారు. తన డేరింగ్‌ స్టంట్స్, డాన్స్‌, విలక్షణమైన పాత్రలు అతని అభివృద్ధికి కారణమయ్యాయి. ఇవే చిరంజీవికి తెలుగు ప్రేక్షుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించిపెట్టాయి. ఇవే చిరంజీవికి ఎనలేని అభిమానులను సాధించిపెట్టాయి. సినిమాలతో సంబంధంలేకుండా చిరంజీవికి అభిమానులు ఉన్నారనడంలో అతిశయోక్తిలేదు. అందుకే కొంతకాలం గ్యాప్‌ తీసుకుని మళ్ళీ నటించిన ఇంద్ర సినిమా తెలుగు సినీపరిశ్రమలో రికార్డులు తిరగరాయగలిగింది. ఈ అభిమానమే నాలుగు దశాబ్దాల కెరీర్‌లో చిరంజీవిలో బాధ్యతను కూడా పెంచింది. అంతేకాదు తన సంపాదనపై నిజాయితీగా పన్ను కడుతూ ఆదాయపన్ను శాఖనుంచి సన్మానాలు అందుకున్నారు. 2006లో రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా పద్మభూషణ్‌ అవార్డు అందుకున్నారు.  చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా బ్లడ్‌బ్యాంక్‌, ఐ బ్యాంక్‌లను నిర్వహిస్తూ ప్రజలకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా పద్మభూషణ్‌ అవార్డు లభించింది. 

White Background
tagore.jpg

విజన్

అక్టోబర్ 1998 చిరంజీవి జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి. చిరంజీవి ఐ & బ్లడ్ బ్యాంక్ మరియు ఛారిటబుల్ ట్రస్ట్‌ స్థాపించారు. చిరంజీవి చేపట్టిన అనేక దాతృత్వ కార్యక్రమాలలో అత్యంత ముఖ్యమైనవి ఇవి. చిరంజీవి చేపట్టిన ఎన్నో సేవా కార్యక్రమాలు ఇవి పునాదులు వేశాయి.

raksadu.jpeg

చిరంజీవికి మొదటి సినిమా స్కోప్ మూవీ 'రాక్షసుడు', ఈసినిమాలో చిరంజీవి పేరు లేని పాత్రను పోషించాడు!

bottom of page