top of page
chiranjeevi-side-looking-picture.jpeg

చిరంజీవి 150 కి పైగా సినిమాల‌లో నటించారు. నలభై మూడు సంవత్సరాల తెలుగు సినీ జీవితంలో మూడు నంది అవార్డులు, ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డు, తొమ్మిది సౌత్ ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు.

   చిరంజీవి 1978లో పునాదిరాళ్లుతో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. పునాదిరాళ్ళుతో కెమేరా ముందుకు వ‌చ్చినా థియేట‌ర్ల‌లో మాత్రం మొద‌ట రిలీజ్ అయింది ప్రాణం ఖ‌రీదు. 1987లో చిరంజీవి న‌టించిన  ‘స్వ‌యంకృషి’ సినిమా ర‌ష్య‌న్ భాష‌లోకి డ‌బ్ చేయ‌బ‌డింది. మాస్కో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ ప్ర‌ద‌ర్శ‌న‌కు ఎంపికై అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది. స్వ‌యంకృషి చిత్రానికి 1988లో ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ ఉత్త‌మ‌న‌టుడి అవార్డుతోపాటు, రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఇచ్చే నంది అవార్డును సైతం కైవ‌సం చేసుకున్నారు. 1988లోనే రుద్రవీణ సినిమాలో నటిస్తూ స‌హ నిర్మాతగా కూడా వ్య‌వ‌హ‌రించారు. ఈ సినిమా సైతం జాతీయ స్థాయిలో ఉత్త‌మ సినిమాతో పాటు ప‌లు రాష్ట్ర స్థాయి అవార్డుల‌ను కైవ‌సం చేసుకుంది.


   1992లో కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వాయించిన ఘ‌రానామొగుడు బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సృష్టించింది. అప్ప‌ట్లోనే 10 కోట్ల‌కుపైగా (2019 లెక్క‌ల ప్ర‌కారం సుమారు 62 కోట్లు లేదా 8.7 మిలియ‌న్ల అమెరికా డాల‌ర్ల‌కు స‌మానం) వ‌సూళ్ళు సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. 1993 ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా విభాగంలో ప్ర‌ద‌ర్శించ‌బ‌డింది. ఈ సినిమా చిరంజీవిని భార‌త‌దేశంలోని జాతీయ వార ప‌త్రిక‌ల క‌వ‌ర్‌పేజీల‌పైకి ఎక్కేలా చేసింది. ఫిలింఫేర్‌, ఇండియా టుడే మ్యాగ‌జైన్‌లు చిరును "బిగ్గ‌ర్ ద బ‌చ్చ‌న్" అంటూ క‌వ‌ర్‌పేజీ ల‌పై కీర్తించాయి. 


     సినిమా హీరోగానే కాదు బాధ్య‌త‌గ‌ల పౌరుడిగా సైతం చిరంజీవి ఎప్పుడూ త‌న ప్ర‌వ‌ర్త‌న న‌లుగురికి ఆద‌ర్శంగా ఉండేలా చూసుకుంటారు. అందుకే 1999-2000 సంవ‌త్స‌రానికి అత్య‌ధిక ఆదాయ‌ప‌న్ను చెల్లించిన వ్య‌క్తిగా ప్ర‌భుత్వం నుంచి స‌మ్మాన్ అవార్డు అందుకున్నారు. 2006లో లో CNN-IBN నిర్వహించిన పోల్‌లో చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన స్టార్‌గా పేరు పొందారు.


   2013 లో 66 వ కేన్స్ చలన చిత్రోత్సవంలో పర్యాటక మంత్రిత్వ శాఖ,  సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల‌ సంయుక్త భాగస్వామ్యంతో ఇన్‌క్రెడిబుల్ ఇండియా ఎగ్జిబిష‌న్‌ను ప్రారంభించారు. మకావులో జరిగిన 14 వ అంతర్జాతీయ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల వేడుకలో చిరంజీవి ఇన్‌క్రెడిబుల్  ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. 2013 లో, IBN LIVE అతడిని "ఇండియన్ సినిమా రూపురేఖలను మార్చిన వ్యక్తులలో" ఒకరిగా పేర్కొంది.

1978

నటనలో అరంగేట్రం

9

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు 

151

కథానాయకుడిగా సినిమాలు

" ప్ర‌ముఖుల " మాట‌ల్లో  చిరంజీవి

DGA_1708.JPG

అమితాబ్ బచ్చన్
నటుడు

తెలుగు సినిమా దేశంలోని ఇత‌ర సినీ ప‌రిశ్ర‌మ‌ల‌కంటే పెద్ద‌ది. తెలుగు సినిమా ఖ్యాతిని చిరంజీవి చాలా ఎత్తుకు తీసుకెళ్ళాడు. అత‌ను భార‌తీయ సినిమాకే రారాజు

@ కె చిరు "ట్వీట్స్‌"

చిరంజీవి ట్వీట్లు

bottom of page